కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి..

Spread the love

కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి..

కోల్‌కతా: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ (Nisith Pramanik) కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌ (West Bengal) లోని కూచ్ బెహర్ (Cooch Behar)లో శనివారంనాడు రాళ్ల దాడి జరిగింది.

ఈ దాడిలో కేంద్ర మంత్రి వాహనం అద్దాలు పగిలాయి. అల్లరిమూకను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తన నియోజకవర్గమైన కూచ్ బెహర్‌లోని పార్టీ కార్యాలయానికి మంత్రి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.

కాగా, తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్టు మంత్రి ప్రమాణిక్ ఆరోపించారు. ”ఒక మంత్రికే రక్షణ లేకుండా పోతే సామన్యుడి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఎలా ఉందనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది” ఆయన అన్నారు..

1,355 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?