సలాం పోలీస్.. సీపీఆర్ చేసి ప్రాణం నిలబెట్టిన రక్షకభటుడు
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాదులో కానిస్టేబుల్ జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన మరువక ముందే..
అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం నాడు బస్ స్టాప్ లో నిలుచున్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ అది గమనించి ఆ యువకుడికి సిపిఆర్ చేశాడు. దీంతో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.
ఈ ఘటన హైదరాబాదులోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తాలోని ఓ బస్ స్టాప్ లో చోటుచేసుకుంది. బస్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఆ యువకుడు అలా పడిపోవడాన్ని అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న రాజశేఖర్ అనే కానిస్టేబుల్ గమనించాడు.
వెంటనే యువకుడి దగ్గరకు పరిగెత్తి సిపీఆర్ చేశాడు. సమయానికి కానిస్టేబుల్ స్పందించడంతో ఆ యువకుడు స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాదులో కానిస్టేబుల్ జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన మరువక ముందే..