నిజామాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
ఆదిలాబాద్: నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హాస్ట్‌ల్‌లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుడిని దాసరి హర్షగా గుర్తించారు. అతడి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం. హర్షం శుక్రవారం ఓ పరీక్ష రాయాల్సి ఉండగా.. హాస్టల్‌లోనే ఉండిపోయాడు. అనుమానం వచ్చిన స్నేహితులు వచ్చి చూడగా.. హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించారు. దీంతో వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.
మరోవైపు విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్ష బాగా చదవుతాడని, ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని వారు చెబుతున్నారు.
నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.