
పదవ తరగతి విద్యార్థిని పై లైంగిక దాడి
తెలంగాణ లో పెరిగి పోతున్న అత్యాచారాలు
అధికార పార్టీ నాయకుడు కొడుకి ఘాతుకం
ఈ తప్పు ఎవరిది
అర్ధరాత్రి యువకుడి వెంట పంపిన టీచర్లదా?
నమ్మి వెళ్లిన యువతిదా
PBC న్యూస్ డెస్క్
వికారాబాద్ జిల్లా యాళ్వాల్ మండలం గత పది రోజుల క్రితం ఓ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యువతి స్కూల్ టీచర్లు తోటి విద్యార్థుల తో కలిసి పిక్నిక్ వెళ్లినా యువతి పిక్నిక్ నుంచి తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది అర్ధరాత్రి అవ్వడంతో యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సొంత గ్రామ పంచాయతీ అధికార పార్టీ నాయకుడి కుమారుడు కదా అని నమ్మి పంపించిన టీచర్లు కామందుడై కాటు వేస్తారనుకోలేదంటూ వాపోయారు వద్దు అన్న అని ఎంత బ్రతిమలాడిన కనుకరించని కామాందుడు కాటువేసేసరికి తన చరల నుండి తప్పించుకొని ఇంట్లో చేరిన యువతి అప్పటికె నా కూతురు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అంటూ ఇంటి గుమ్మం ముందు ఎదురు చూస్తున్న తండ్రి కి ఎం చెప్పాలో తెలియని ఆ చిట్టి తల్లి తండ్రితో ఏమాట చెప్పకుండా రెండో రోజు స్కూలుకు వెళ్లి టీచర్ కు జరిగిన సంఘటన చెప్తే నువ్వు ఇంట్లో చెప్పవ?నువ్వు ఇంట్లో చెప్పకు అని తిరిగి ఆమెను మండలించారని ఎటు ఎవరికి చెప్పుకోవాలి తెలియని పరిస్థితి లో తన సోదరికి ఫోన్ ద్వారా సంఘటన తెలియజేయడంతో తండ్రికి తెలిసింది తండ్రికి తెలిసిన మరు క్షణం స్కూల్ ప్రధానోపాధ్యాయులు దెగ్గరికి వెళ్తే ఎలాంటి స్పందన లేదని ఆ తరువాత పోలీసులకు ఆశ్రయించనని తెలిపారు
రేపు నా కూతురు పరీక్షలు రాయడానికి పంపిచాలంటేనే భయమేస్తోంది అని కన్నీరుమున్నీరు అయ్యారు
నా కూతుర్ని న్యాయం చేసి ఇలాంటి సంఘటన ఏ కుటుంబానికి రాకుండా చేయాలని ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ కళ్ళ మీదపడి ప్రాధేయప్పడ్డారు
ఈ సందర్భంగా ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజన బిడ్డకు ఒక న్యాయం! దిశ కు ఒక న్యాయమా? నిందితుడిని ఫాస్ట్రాక్ కోర్టు కింద వెంటనే శిక్షించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు
ఈ ఘటన జరిగి సుమారు పది రోజులు కావస్తున్నా ఘటన స్థలానికి కనీసం ఒక్క ఎమ్మార్వో కూడా సందర్శించాకపోవడానికి గల కారణాలు ఏంటి అని ఈ నెల 27 వరకు బాధిత యువతి ని న్యాయం చేయకపోతే ఈ నెల 28 న సుమారు నాలుగు వేల మంది తో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు బాధిత యువతి ఉద్యోగం వచ్చేంత వరకు ఉచ్ఛిత విద్య కోటి రూపాయలు ఎక్సగ్రెసియో ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు