
హైదరాబాద్ లో ముగ్గురు బాలికల మిస్సింగ్..ఆందోళనలో కుటుంబసభ్యులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ముగ్గురు బాలికల మిస్సింగ్ కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన ప్రమీల, స్వప్న, హసీనా అనే ముగ్గురు బాలికలు బర్త్ డే వేడుకలు ఉన్నాయని చెప్పి మంగళవారం రాత్రి వెళ్లారు.
అయితే ఎంత సమయానికి వారు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం వరకు వారు రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు.అయినా కానీ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ముగ్గురు బాలికలు కలిసి ఫ్రెండ్ బర్త్ డే వేడుకలు ఉన్నాయని చెప్పి వెళ్లారు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. అయితే వారు బర్త్ డే వేడుకలకు వెళ్లే క్రమంలో ఏమైనా జరిగిందా లేక వచ్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
లేదంటే ఫ్రెండ్ వాళ్ల ఇంటి దగ్గర ఏదైనా అనుకోని ఘటన జరిగిందా అని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తిరుమలగిరి పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాలికలను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యారా? అసలు వారి మిస్సింగ్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బర్త్ డే వేడుకలకు బయలుదేరిన బాలికలు వెళ్లే క్రమంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఏవైనా క్లూస్ దొరికితే బాలికల మిస్సింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే బాలికల మిస్సింగ్ కు సంబంధించి పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు. అలాగే పలువురిని ప్రశ్నిస్తూ బాలికల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు బాలికల మిస్సింగ్ తో హైదరాబాద్ లో కలకలం రేగింది.
ఈరోజు సాయంత్రం వరకు బాలికల మిస్సింగ్ ను ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.