కానిస్టేబుల్ పాడుపని.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూస్తే షాక్..

Spread the love

కానిస్టేబుల్ పాడుపని.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూస్తే షాక్..
గన్నవరంలో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టడంతో.. ఘర్షణలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.

అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఆ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. అయితే మొన్న సాయంత్రం ఓ వైపు తెలుగు దేశం పార్టీ కార్యాలయం దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంటే.. ఇరు వర్గాలను శాంతిపచేయడమో.. లేదా చల్లా చెదురు చేయడమో చేయాల్సిన బాధ్యత ఖాఖీలది.. చేతిలో లాఠికి పని చెప్పైనా పరిస్థితిని చక్క దిద్దాలి..

కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రం.. అవేవి పట్టించుకోలేదు.. లోపల అంత గొడవ జరుగుతుంటే అటువైపు చూడలేదు. ఆ గొడవ తనకు ఎందుకులే అని చేతులు కట్టుకుని కూర్చేలేద.. కార్యలయంలో ఎవరూ లేకపోవడంతో పాడుబుద్ధి ప్రదర్శించాడు..

సాధారణంగా కానిస్టేబుల్ అయినా.. హోం గార్డు అయినా.. ఘర్షణ జరుగుతున్న చోట విధుల్లో ఉంటే అక్కడ పరిస్థితుల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకు భిన్నంగా ఆ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించడం ఇప్పుడు దుమారం అవుతోంది.

అక్కడ ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ డబ్బులు దోచుకోవడంలో బిజీ అయ్యాడు.దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివారాలు పరిశీలిస్తే

గన్నవరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర దాడులు నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి పోలీసుల వచ్చి, బందోబస్తు నిర్వహించారు. ఓవైపు వైసీపీ వర్గాలు టీడీపీ ఆఫీస్‌ని ధ్వంసం చేస్తుంటే, మరోవైపు ఓ కానిస్టేబుల్ అదును చూసి ఆ ఆఫీస్‌లో డబ్బులు దోచుకున్నాడు.

కార్యాలయం టేబుల్ సొరుగులో ఉన్న ఓ సెల్‌ఫోన్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ లాంటి బాక్సును తీసుకుని అటుఇటూ చూస్తూ.. ఫ్యాంటు జేబులో వేసుకున్నాడు.

ఇదంతా సీసీకెమెరాలో రికార్డైంది. ఇంతలోనే అక్కడికి కొందరు రావడం చూసి.. ఒక్కసారిగా కంగారుపడ్డాడు. తాను దొంగతనం చేయలేదన్నట్టుగా.. ఏదో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. తరువాత అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. ఆ కానిస్టేబుల్ బాగోతం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని చూసి.. సదరు కానిస్టేబుల్, పోలీస్ విభాగంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో.. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆ కానిస్టేబులో ఎవరో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

7,185 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?