
గుట్టు చప్పుడు కాకుండా.. సర్పంచ్ ఫామ్ హౌస్‌లో వ్యభిచారం!
గుట్టు చప్పుడు కాకుండా సర్పంచ్ ఫామ్ హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాగుట్టు రట్టైంది. హైదరాబాద్ శివారులోని కొత్తూరులో ఓ సర్పంచ్ ఫామ్ హౌస్‌లో వ్యభిచారం నిర్వ హిస్తున్నట్లు సమాచారం మేరకు సైబరాబాద్ ఏహెచ్‌టీయూ బృదం దాటి చేసింది.
ఈ దాడిలో అల్వాల్‌కు చెందిన ముగ్గురు మహిళలను అలాగే ముగ్గురు నిర్వాహకులను, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు.
కొత్తూరులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా, ఎల్బీనగర్‌ఠాణ పరిధిలో మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎల్బీనగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలియడంతో అధికారులు వెళ్లి, మచిలీపట్నంకు చెందిన మహిళతో పాటు, మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
7,082 Views