వైరల్ వీడియో.. 17ఏళ్ల బాలికపై అమానుషం.. నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి!

Spread the love

వైరల్ వీడియో.. 17ఏళ్ల బాలికపై అమానుషం.. నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి!

internet desc: మైనర్ బాలిక పట్ల.. ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ బాలిక పెళ్లిక నిరాకరించడంతో.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు.

అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

మైనర్ బాలిక పట్ల.. ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ బాలిక పెళ్లిక నిరాకరించడంతో.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో.. 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి దాడి చేశాడు. పదునైన ఆయుధంతో దాడి చేసి.. నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘనటపై పోలీసులు పలు వివరాలు వెల్లడించారు.

రాయ్ పూర్ లోని గుఢియారీ ప్రాంతంలో ఓంకార్ తివారీ అనే వ్యక్తి ఓ దుకాణం నడుపుతున్నాడు. కొంతకాలంగా మైనర్ బాలిక అతని వద్ద పని చేస్తోందన్నారు. బాలికను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. బాలిక నిరాకరించడంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన బాలిక, బాలిక తల్లిని ఆస్పత్రికి తరలించారు. పలువురు యువకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్ గా మారడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలికపై దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. వివిధ కారణాల వల్ల ఉద్యోగం మానేస్తానని బాలిక చెప్పారు. దీనికి నిందితుడు ఒప్పుకోకపోగా బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి బాలికతోపాటు ఆమె తల్లి నిరాకరించారు.

ఆగ్రహంతో బాలికపై నిందితుడు ఆయుధంతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే జుట్టు పట్టుకొని.. నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనను యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

తన సోదరిపై దాడి జరిగిందని.. బాధితురాలి సోదరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వీడియో చూసిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశ్యంతో.. సదరు బాలికను ఎలాగైతే నిందితుడు తీసుకెళ్లాడో అధే విధంగా పోలీసులు తీసుకెళ్లారు. రోడ్డుపై ఊరేగిస్తూ.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.

2,981 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?