
తిరుణాలలో పొంచి ఉన్న ప్రమాదం
-విద్యుత్ శాఖ హెచ్చరికలు బేకాతర్
-నిబంధనలు పట్టించుకోని ఈవో
-కానరాని పర్యవేక్షణ అధికారుల కమిటీ
మధిర పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మహా మృత్యుంజయ స్వామి ఆలయంలో రేపటి నుండి జరగనున్న శివరాత్రి తిరుణాలలో నిబంధనలు పట్టించుకోకుండా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం పట్ల అధికారులు ప్రమాద హెచ్చరికలు చేస్తున్నారు.
శివరాత్రి మహోత్సవాన్ని నిర్వహించడంతోపాటు ఆలయ పరిసరాల్లో ఉన్న రెండున్నర ఎకరాలకు భూమిలో జాయింట్ వీల్ తో కూడిన వినోదాత్మక పరికరాలను ఏర్పాటు చేసి తిరునాళ్లు నిర్వహించే నాలుగు రోజులపాటు కొనసాగించడం ఆనవాయితీగా వస్తుంది
అయితే కేవలం ఆలయ ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ఆలయ కమిటీ ఈవో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే తిరుణాలకు సంబంధించి భద్రతా చర్యలు చేపట్టవలసిన ప్రత్యేక ఏర్పాట్ల విషయమై స్థానికంగా ఉన్న రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఫైర్, మున్సిపల్ శాఖ లకు సంబంధించిన అధికారులను కనీసం సంప్రదించకుండా వ్యవహరించడం కనిపిస్తోంది.
ఈ ప్రాంతంలో 33/11 కేవీ కేవీ హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉండగా ఈ ప్రాంతంలోనే ఎత్తైన జాయింట్ వీళ్లను ఇతర వినోదాత్మక పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది
నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ లైన్ కు దూరంగా ఏర్పాటు చేయవలసి ఉండగా, వీటిని పట్టించుకోకుండా జాయింట్ వీల్ పాట పాడిన వ్యక్తి తన ఇష్టానుసారంగా అగ్రిమెంట్ కు విరుద్ధంగా గత ఏడాదికి మించి అదనంగా వినోదాత్మక వస్తువులను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే తీవ్రమైన ప్రాణనష్టం జరిగే అవకాశం మెండుగా ఉంది.
ఈ తిరుణాళ్లకు వేల సంఖ్యలో ప్రజలు భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్న క్రమంలో ఆలయ ఈవో పాలకవర్గం ఒంటెద్దు పోకడలతో వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కాగా తిరునాళ్లకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతుల మేరకు నిబంధనలను అనుసరించి మూడు నుండి నాలుగు రోజులు మాత్రమే ఇక్కడ తిరునాళ్ళు నిర్వహించాల్సి ఉండగా, దీనిని ఇష్టా రీతిన అనుమతులు ఇస్తూ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కేవలం ఆలయం ఆదాయం పేరుతో తిరునాళ్లకు వచ్చే భక్తుల రక్షణను భద్రతను పక్కనపెట్టి వారి జేబులోకి చిల్లుపడే విధంగా టిక్కెట్ల ధరలు పెంచుతూ ఏడాదికి ఏడాది దోచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
తిరుణాలలో ప్రమాద టికులు చేసిన హెచ్చరిక చేసిన విద్యుత్ శాఖ
ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు హాజరయ్యే ఈ నాలుగు రోజుల కార్యక్రమాల్లో చేపట్టవలసిన చర్యలపై నిబంధనల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థానిక అధికారులతో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది
కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కనీసం సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. కాగా ఆలయ అధికారులు సమాచారం ఇవ్వకున్నా బాధ్యతమైన పర్యవేక్షణ బాధ్యతను గుర్తించిన విద్యుత్ శాఖ తిరునాళ్ల ప్రాంతాన్ని సందర్శించి ప్రమాదగంటికలు మోగే అవకాశం ఉన్నది.
అంటూ తక్షణమే వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో కు లేఖని పంపింది. అయితే ఈ లేఖను తీసుకోవడానికి కూడా ఇష్టపడని ఈవో కొత్తూరు జగన్మోహన్రావు ప్రమాదం జరిగితే తాను బాధ్యత వహిస్తానని పరుషంగా మాట్లాడడం జరిగిందని సమాచారం.
జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ శాఖ అధికారులు తక్షణం స్పందించి వేలాదిమందిగా హాజరయ్యే తిరుణాలలో చేపట్టవలసిన రక్షణ చర్యలను తీసుకోవాల్సిందిగా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన వినోదాత్మక యంత్రాలను తొలగించాలని, నిబంధనల మేరకు పర్యవేక్షణ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.