
అధ్యక్షురాలు షర్మిలను ఆదివారం
మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మహబూబాబాద్లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్నయక్ను ఉద్దేశించి షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు.
షర్మిల వ్యాఖ్యలపై శనివారం రాత్రి నుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. షర్మిల యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచిత పేర్కొంటూ మహబూబాబాద్ పోలీసులు ఆదివారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు
పోలీసులు మళ్లీ ఝలక్ ఇచ్చారు. ఆమెకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటికే ఆమె పాదయాత్రను రెండుసార్లు అడ్డుకున్నారు పోలీసులు.
ఇప్పుడు మరోసారి అడ్డుకోవడంతో ఆమె అనుచరుల్లో ఆందోళన మొదలైంది.
వైఎస్ షర్మిలకు బీఆర్ ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు జరిగిన మాటలు హద్దులు మీరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఆంధ్రా నుంచి కొందరు కొజ్జాల్లా కనిపించే వలస వాదులు వస్తున్నారంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు.
శంకర్ నాయక్ కామెంట్లతో.. పర్యటనలు చేస్తే చేసుకోండి గానీ.. అభ్యంతరంగా మాట్లాడొద్దు అంటూ కామెంట్లు చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు కనుసైగ చేస్తే తరిమి, తరిమి కొడుతారంటూ తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కూడా సీరియస్ గానే రియాక్ట్ అయింది.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు చేసింది.
ఇలాంటి తాటాకు చప్పుళ్లకు వెఎస్సార్ బిడ్డ భయపడదు అంటూ కామెంట్లు చేసింది. దాంతో శంకర్ నాయక్ అనుచరులు వైఎస్ షర్మిల బస చేసిన ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ముందు జాగ్రత్తతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు
యాత్రకు పర్మిషన్ రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆమెను నేరుగా హైదరాబాద్కు తరలించనున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే శంకర్నయక్పై చేసిన వ్యాఖ్యలతో భగ్గుమన్న ఆయన అనుచరులు షర్మిల కాన్వాయ్పై రాళ్ల వర్షం కురిపించారు. ఆమెను అరెస్ట్ చేస్తుండగా, పోలీసుల ఎదుటే బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయారు. ఈ ఘటనలో షర్మిల కాన్వాయ్లోని పలు వాహనాలు
దెబ్బతిన్నాయి. మొత్తంగా
మహబూబాబాద్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.