
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా సాయన్న అనారోగ్యంతో ఉన్నారు. దీంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సాయన్న కన్నుమూశారు. సాయన్నకు భార్య , ముగ్గురు పిల్లలున్నారు.
1951 మార్చి 5న సాయన్న జన్మించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి సాయన్న విజయం సాధించారు. టీడీపీ నుండి సాయన్న రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాయన్న టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 1994లో టీడీపీ అభ్యర్ధిగా సాయన్న తొలిసారిగా ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.
కిడ్నీ సంబంధిత సమస్యలత సమస్యలతో సాయన్న బాధపడుతున్నారు. దీంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ సాయన్న అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స ప్రారంభించేలోపుగానే సాయన్న మృతి చెందాడు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హఠాన్మరణం చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న మృతిచెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయన్న 2014, 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హఠాన్మరణం చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న మృతిచెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయన్న 2014, 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు