
ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్‌ఐ భార్య, కూతురు మృతి
బాపట్ల జిల్లా: మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
మృతుల్లో అద్దంకి ఎస్సై సమంధర్ వలి భార్య కూతురు కూడా ఉన్నారు. చిన్నగంజాం లో తిరుణాలకు డ్యూటీకి వెళ్లిన ఎస్సై సమందర్ వలి, తన భార్య కూతురుతో పాటు, పక్కింటి మరో ఇద్దరిని కూడా తీసుకెళ్లారు.
శివాలయంలో దర్శనం ముగించుకున్న తర్వాత డ్రైవర్‌ని ఇచ్చి కుటుంబ సభ్యులను అద్దంకి ఇంటికి పంపించారు.
అయితే తిరుగు ప్రయాణంలో మేదరమెట్ల జాతీయ రహదారిపై రాగానే డ్రైవర్ కునుకు తీయడంతో ఒకసారిగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టి అవతలి రోడ్డుపై పడిపోవడంతో అటుగా వచ్చిన లారీ కారుని ఢీకొంది.
దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వహీదా(39) ఆయేషా(9) గుర్రాల జయశ్రీ (50) గుర్రాల దివ్య తేజ(27), డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు.
డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఐదుగురు నిండు ప్రాణాలు బలయ్యాయి.. తన భార్యతో పాటు తన 9 ఏళ్ల కూతురు ప్రమాదంలో చనిపోవడంతో అద్దంకి ఎస్ఐ సమందర్ వలి బోరున వినిపిస్తున్నారు.
కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను అద్దంకి మార్చురీకి తరలించారు.
మహా శివరాత్రి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురం గ్రామ సమీపంలో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం..
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సాయి, రఫీ, శేఖర్ మానవపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెనిదిన వారిగా గుర్తించారు. అలంపూరులో మహాశివరాత్రి వేడుకలను చూసుకొని శనివారం మధ్య రాత్రి ఒంటి గంట సమీపంలో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.