
మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ
యాదగిరి గుట్టలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి ఇయ్యాళ శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ్నుంచి వెళ్తున్న మంత్రి హరీష్ రావును దళితులు, స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు గుంజుకొని ఆస్పత్రి కట్టడం ఎంతవరకు సమంజసం అంటూ మంత్రితో వాగ్వాదానికి దిగారు. ఏ ఆధారం లేని తమ బతుకుల సంగతేంటీ అని దళితులు మంత్రిని ప్రశ్నించారు.
స్థానికుల ప్రశ్నలకు మంత్రి స్పందించకుండా వెళ్లిపోవడంతో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దగ్గర దళితులు మొరపెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
యాదగిరి గుట్టలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి ఇయ్యాళ శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ్నుంచి వెళ్తున్న మంత్రి హరీష్ రావును దళితులు, స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు గుంజుకొని ఆస్పత్రి కట్టడం ఎంతవరకు సమంజసం అంటూ మంత్రితో వాగ్వాదానికి దిగారు. ఏ ఆధారం లేని తమ బతుకుల సంగతేంటీ అని దళితులు మంత్రిని ప్రశ్నించారు. స్థానికుల ప్రశ్నలకు మంత్రి స్పందించకుండా వెళ్లిపోవడంతో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దగ్గర దళితులు మొరపెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు.