
ఏరియా ఆస్పత్రిలో చేరిక
స్థానికుల్లో ఒక్కసారిగా ఆందోళన..
– క్లోరిన్ వాయువుగా గుర్తింపు..
జనగామ జిల్లా, ఫిబ్రవరి 17:- కేంద్రలోని వాటర్ ట్యాంక్ సమీపంలో విషవాయు లీకేజీ తో కలకలం నెలకొంది. గురువారం రాత్రి వాయువు పీల్చిన అనేకమంది అస్వస్థత గురికావడంతో స్థానిక జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎవరికి ప్రాణాపాయం లేకున్నప్పటికీ స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
తెలియని గ్యాస్ ప్రభావంతో ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏం జరిగిందో ఏమో తెలుసుకునే లోపే ఊపిరాళ్లకి ఇబ్బంది గురయ్యారు. ఊపిరి ఆడక జనగామ ఏరియా హాస్పిటల్‌కు చేరిన బాధితులతో కిక్కిరిసింది. దాదాపు 20 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు, ఎవరికి ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితులకు అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
ఇప్పుడు విషవాయువు ప్రభావం తగ్గిందని తెలిసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు క్లోరిన్ వాయు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. లీక్ అవుతున్న సిలిండర్‌ను నీటిలో వేయడంతో గ్యాస్ ప్రభావం కొంత తగ్గినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికార వర్గాలు సేకరిస్తున్నారు