స్వంత జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డిపై దాడి!

Spread the love

ఎంపీ కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

నల్లగొండలో కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఇటుకలపాడుకు వచ్చే రూట్లో రోడ్లు బాగోలేవని ఓ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డిపై కుర్చీలు, కర్రలు విసిరి దాడికి యత్నించారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్ఎస్‌ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు.

దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

6,921 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?