
భార్య బాగోతం.. చెడు వ్యసనాలకు బానిసగా మారి, కట్టుకున్న భర్తనే
హైదరాబాద్: భర్తను చున్నీతో ఉరిబిగించి హతమార్చిన భార్యను, ఆమెకు సహకరించిన బాలికను జీడిమెట్ల పోలీసులు బుధవారం రిమాండుకు తరలించారు.
సీఐ పవన్ వివరాల ప్రకారం.. సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముండే సంతోష్(28), అతని భార్య రేణుక(24)లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేష్ ఆటో నడుపుతుండగా రేణుక ఇంట్లోనే ఉండేది. వీరికి ఇద్దరు కుమార్తెలు.
పెళ్లయిన సంవత్సరం తర్వాత రేణుక చెడు వ్యసనాలకు బానిసయ్యింది. రేణుక తరచూ కుల్లు దుకాణానికి వెళ్లేది.
అక్కడ రేణుకకు దుండిగల్ తాండాకు చెందిన బాలిక(17) పరిచయం అయ్యింది. ఆమెను తనతో పాటు ఇంటికి తీసుకువచ్చి తనతో పాటే అక్కడే ఉంచుకుంది.
ఈనెల 6వ తేదీన రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రేణుక చేసే కొన్ని పనులకు సురేష్ అడ్డు చెప్పేవాడు. దీంతో రేణుక ఎలాగైన భర్త సురేష్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది.
అదే రోజు రాత్రి రేణుక, భర్త సురేష్, బాలికలు పూటుగా మద్యం సేవించారు. మత్తులోకి జారుకున్న సురేష్ మెడకు చున్నీ బిగించి బాలిక సహాయంతో హత్య చేసింది.
అనంతరం ఏమి తెలియనట్లు సురేష్ మృతదేహాన్ని సంచిలో ఉంచి ఇంటి బయట పడేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు విచారణలో భార్య రేణుక, బాలిక కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బుధవారం రేణుక, బాలికను రిమాండ్‌కు తరలించారు.