వివాదంలో.. చెవి కొరికి పడేశాడు!

Spread the love

వివాదంలో.. చెవి కొరికి పడేశాడు!

యర్రగొండపాలెం పట్టణం : స్థల వివాదంలో జరిగిన గొడవలకు ఓ వ్యక్తి ప్రత్యర్థి చెవి కొరికి ముక్క తీసేసిన సంఘటన ప్రకాశం జిల్లా వై.పాలెం మండలం గడ్డమీదపల్లె గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మాచపల్లె నాగరాజు తండ్రి 25 ఏళ్ల క్రితం గ్రామంలో స్థలం కొన్నారు. ఆ స్థలాన్ని ఇంటి కోసం నాగరాజు బాగు చేయిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మురళి ఆ స్థలం గ్రామ కంఠమని పేర్కొంటూ స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. ఇదే విషయమై సోమవారం రాత్రి నాగరాజు, అతని బంధువులను మురళి దుర్భాషలాడాడు.

దీంతో నాగరాజు, అతని బంధువులు పెద్దబాలగురవయ్య, చిన్న బాలగురవయ్య, పెద్దబాలగురవయ్య భార్య లక్ష్మి..మురళిపై దాడి చేశారు. ఈ సంఘటనలో నాగరాజు.. మురళి చెవి కొరికేయడంతో అది తెగి కింద పడింది.

6,911 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?