
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
తూర్పు గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.
జిల్లాలోని బురుగుపూడిలో చంద్రబాబు కారును మరో కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది.
కాగా చంద్రబాబు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం గోకవరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. పూలతో స్వాగతం పలికారు.
కాగా ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ పేరుతో మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని రోజులపాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి రెగ్యులర్‌గా ప్రజల్లో ఉండేందుకు పక్కా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు.
ఒకవైపు చంద్రబాబు.. మరోవైపు లోకేష్ పాదయాత్రతో టీడీపీ కార్యకర్తలలో మరింత జోష్ పెంచుతోంది.