
ప్రేమికుల రోజు ప్రేమ పాఠాన్ని బోధించిన టీచర్
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటి మీద గూడెం పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ వాంకుడోత్ గోపీనాథ్ ఆ ఊరిలో ఉన్న యువతకు వినూత్నమైన రీతిలో ప్రేమ పాటాలను బోధించాడు.. నేటి యువత కౌమార దశలో ప్రేమ అనే ఒక పదంతో బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఓ అమ్మాయి అబ్బాయి కోసం, ఓ అబ్బాయి అమ్మాయి కోసం తమ లక్ష్యాలను మరిచి తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు…
ప్రేమ అనే పదాన్ని అర్థం లేకుండా ప్రేమ అంటే కేవలం అమ్మాయి అబ్బాయిలను ప్రేమించడమే పనిగా పెట్టుకుని నేటి యువత జన్మనిచ్చిన తల్లిదండ్రులను జీవిత పాఠాలను,సద్బుద్ధి నేర్పించే గురువులను గౌరవించి ప్రేమించాలని& భూమిపై ఉన్న సర్వ ప్రాణులను 365 రోజులు 24 గంటలు ప్రేమిస్తూ, లక్ష్యాలను ప్రేమిస్తూ గమ్యాన్ని ముద్దాడాలని అప్పుడు మాత్రమే ప్రేమకు సార్ధకత ఏర్పడుతుందని అన్నారు.
ఆ టీచర్ సామాజిక బాధ్యతగా యువతను మేల్కొల్పి నావల్ల ఒక్కరు మారిన చాలు అనే లక్ష్యంతో పని చేస్తున్నానని చెప్పారు
ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుందని నేటి యువత కేవలం యువతిపై యువకులపై మాత్రమే చూపిస్తున్నారని అది మంచి పద్ధతి కాదని… కొన్ని సినిమాలను చూసి యువతచెడు సారాంశాన్ని మాత్రమే ఆకర్షిస్తున్నారని అందులో ఉన్న మంచిని మాత్రం అర్థం చేసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు..
నా బాధ్యతగా నేను పనిచేస్తున్న గ్రామంలో యువత చెడు అలవాట్లకు పోకుండా ముందుగా జన్మనిచ్చిన అమ్మానాన్నలకు అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లకు కుటుంబ సభ్యులందరికీ ప్రతిరోజు ప్రేమిస్తూ భారతదేశానికి ఉపయోగపడే గొప్ప పౌరునిగా ఎదిగి సన్మార్గంలో నడిచే విధంగా చేయడమే నా ప్రయత్నమని అన్నారు….
నేటి యువత ప్రేమ అనే మత్తులో మునిగి సమాజంలో అనేక దుష్పరిణామాలు జరుగుతున్నాయని ఇలాంటి వాటిని కొంతైనా అరికట్టే ప్రయత్నం అందరూ చేయాలని అన్నారు….
తల్లితండ్రులు తమ యొక్క పిల్లలు ప్రసార మాధ్యమాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఓ కంట కనిపెట్టాలని. & నేడు చిన్న పిల్లలు సైతం ఫోన్లకు బానిస అవుతున్నారని ప్రేమను ఒక ఫ్యాషన్ గా మార్చుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించకుండా తమను దక్కని వారి గూర్చి డబ్బులు ఖర్చు చేసుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ సరదా జీవితాన్ని గడుపుతూ మత్తు పానీయాలకు బానిసై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హత్యలు మానభంగాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు…
ప్రేమకు ప్రత్యేకమైన ఒకరోజు ఉండదని ప్రేమ అనేది మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రేమ ఒక ప్యాషన్ కాకూడదని అన్నారు…
ఆపదలో ఉన్న వారిని తమకు తోచిన రీతిలో ఆదుకోవాలని కటిక పేదవారిని ప్రేమించి సహాయం చేయాలని ఫిబ్రవరి 14వ తారీకు ఒకరోజు మాత్రమే ప్రేమికుల దినోత్సవం కాదని ప్రతిరోజు అందరినీ ప్రేమిస్తూ ప్రేమ దినంగా జరుపుకోవాలని గోపీనాథ్ సార్ అన్నారు…..
విదేశీ సంస్కృతిని విడనాడి స్వదేశీ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ సమాజంలో గొప్పగా జీవించాలని యువతకు పిలుపునిచ్చాడు….
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కలలను సహకారం చేసి తల్లితండ్రుల కళ్ళల్లో ఆనందం ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు మాత్రమే నిజమైన ప్రేమికులుగా మిగులుతామని అన్నారు….
యువతి యువకులు కౌమార దశలో ఆకర్షణలకు గురి అయ్యి తాత్కాలిక ఆనందం కోసం ప్రాణాలను పోగొట్టుకొని తమ యొక్క కుటుంబాన్ని శోకసముద్రంలోకి నెడుతున్నారు.. కాబట్టి యువతి యువకులు భాగోద్వేగంతో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు..
మానవుని జీవన పరిణామ దశలో పెళ్లి తప్పకుండా ఉంటుందని దానికోసం ఎవరు తొందరపడకూడదని అన్నారు…
పుల్వామా దాడులు జరిగి నేటితో నాలుగు ఏళ్ళు అయినందు మనకోసం తమ ప్రాణాలను పోగొట్టుకున్న వీర జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని వారి త్యాగాలను విద్యార్థులతో నెమరు వేసుకోని మౌనం పాటించడం జరిగింది..
From
వాంకుడోత్ గోపీనాథ్
SGT టీచర్
(ఒక్కరు మారిన చాలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు )