పాతబస్తీ గలీజ్​దందాపై అన్నీ అనుమానాలే..!

Spread the love

పాతబస్తీ గలీజ్​దందాపై అన్నీ అనుమానాలే.. !

మహిళల నగ్న కొలతలు డైరీలో రాయడం వెనుక కారణమేంటి?
చార్మినార్: పాతబస్తీ గలీజ్​దందాపై ఎన్నోఅనుమానాలు తలెత్తుతున్నాయి..? డెకాయ్​ఆపరేషన్‌లో పట్టుబడిన బ్రోకర్ సయ్యద్​ హుస్సేన్​అలియాస్ బాబాను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడా..?

అనే సందేహాలుతలెత్తుతున్నాయి. భర్త చనిపోయిన, వదిలిపెట్టిన నిరుపేద మహిళలను కాంట్రాక్ట్​పద్దతిలో రెండవ పెళ్ళి చేయడానికే అని విచారణలో చెబుతున్న బాబాకు ప్రస్తుతం పెళ్లయిన నూటికి 80 శాతం మహిళలకు డెలీవరీ సమయంలో ఖచ్చితంగా సర్జరీలు జరుగుతూనే ఉన్నాయన్న విషయం తెలియదా..?

అలాంటప్పుడు శరీరంపై సర్జరీ గుర్తులు ఉంటే రిజెక్ట్​అని ముందే చెబుతున్న బాబా డబ్బుల ఎర చూపెట్టి పెళ్ళిళ్లుకాని నిరుపేద యువతులను టార్గెట్ చేసినట్లే కదా అన్న ఆలోచనలు తలెత్తుతున్నాయి.

ఇంతకు యువతుల నగ్నవీడియోల కొలతలు తీసుకునేటప్పుడు ఎలాంటి వెబ్​సైట్‌లో పెట్టమని, సీక్రెట్‌గానే ఉంచుతామని నమ్మించి.. నగ్న శరీరంపై కొలతలు ఎందుకు తీసుకుంటున్నాడు? తీసుకునే సమయంలో ఫొటోలు, వీడియోలు ఎందుకు చిత్రీకరిస్తున్నాడనేది మిలియన్​డాలర్ల ప్రశ్నగా మారింది.

ఒంటరిగా ఉన్న యువతుల నగ్న ఫొటోలు, వీడియోలు మాత్రమే తీసుకుంటున్న బాబా.. ఒకవేళ బ్లూ ఫిల్మ్​ఇతర పోర్న్​సైట్‌లలో పెట్టి అడ్డంగా డబ్బులు సంపాదించుకుందామనుకున్నా? ఇప్పటికే బోలెడు పోర్న్​వీడియోలు, వెబ్​సెట్‌లలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి. సో.. ఆ శరీర సౌష్ఠవ న్యూడ్​కొలతలు.. వీడియోలు ఎందుకు..? అన్న సందేహాలు పలువురిని ఆలోచింపచేస్తున్నాయి.

శరీర సౌష్ఠవం బాగా ఉండి ఫిజిక్​ఒక వేళ నచ్చితే కాసుల పంటపండినట్టే అని చెబుతూ.. నమ్మిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్​పెళ్ళిళ్లమాటున అంతరాష్ట్ర కొత్త పద్దతికి శ్రీకారం చుట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నారా ? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

అసలు ఏం జరిగింది..?

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన ఓ వ్యక్తి వద్ద సయ్యద్​హుస్సేన్ బ్రోకర్‌గా పనిచేసేవాడు. అయితే కర్ణాటకలో ఇది వరకే రెండు పెళ్ళిలు చేసుకుని, ఎనిమిది మంది పిల్లలు ఉన్న సయ్యద్​ హుస్సేన్‌కు పాతబస్తీ వట్టేపల్లితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన దగ్గరి బంధువుల సహకారంతో ఐదు నెలల క్రితం తన మరదలితో కలిసి బార్కాస్​ ప్రాంతానికి వలస వచ్చాడు.

పక్కా ప్లాన్‌తో సయ్యద్​ హుస్సేన్, అతని మరదలు బార్కాస్‌కు వచ్చారు. అతని మరదలు స్టిచ్చింగ్​చేసేది. స్టిచ్చింగ్​కోసం వచ్చే ఇరుగుపొరుగు వారిని వాళ్ల ట్రాప్‌లో పడేసేది. ఎంత సంపాదించినా ఒక్కసారిగా అమీర్‌లు కాలేరని.. తాను చెప్పిన మాట వింటే లక్షలు నీ సొంతమవుతాయని నమ్మబలికేది.

ఆమె మాయలో పడి వచ్చిన అమాయక యువతులకు పక్క రూమ్‌లోకి తీసుకువెళ్లి ముందుగా మంచి నీరు, చాయ్​ఇస్తూ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసేది. న్యూడ్‌గా శరీర కొలతల వీడియోలు, ఫొటోలు తీస్తారని, అందులో భయపడాల్సిన పనేమి లేదని, ఒక్క చిత్రం కూడా బయటికి పొక్కదని ఎలాంటి వెబ్ సైట్‌లో పెట్టరని మాయమాటలతో నచ్చజెప్పేది.

తీసిన చిత్రాలను కూడా సీక్రెట్‌గా కర్ణాటకలోని ఉస్తాద్‌కు పంపిస్తారని.. అతను ఒకే అంటే మీకు లక్షల్లో డబ్బులు వస్తాయని ఎరవేసేది.

అందులో చిక్కిన యువతులను పక్క రూమ్‌లో ఉన్న బావ సయ్యద్​హుస్సేన్ దగ్గరికి తీసుకువెళ్లేది. అతని వలలో చిక్కిన పేద యువతులను బాబా కళ్లెదుటే న్యూడ్​ఫొటోలు, వీడియోలు తీసుకునే వారు. స్వయంగా బాబానే న్యూడ్​కొలతలు తీసుకునే వాడు. ఇదంతా సెల్​ఫోన్​లో ఫొటోలు, వీడియోలు తీసుకునే వాడు.

సదరు యువతుల శరీర సైజుల కొలతలు, చిరునామా, సెల్​పోన్​నెంబర్లను తన డైరీలో పొందపరిచే వాడు. ఈ డైరీలో ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించిన యువతులకు ఎవరు.. ఎపుడు? ఎంతమంది తమ వద్దకు వచ్చారన్నది? తమ వద్ద డాటా ఉండాలి కదా ? లేకుంటే ఎలా అని బాబా చెబుతుండడం గమనార్హం.

కాగా తీసుకున్న న్యూడ్​చిత్రాలను కర్ణాటకలోని తన ఉస్తాద్‌కు పంపిస్తానని.. అతనికి నచ్చి ఓకె అంటే మీరు కర్ణాటకకు వెళ్లాళ్సి వస్తుందని నమ్మించేవాడు.

అలా అతని ఫోన్‌లో ఎందరో అమాయక యువతుల నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు తెలిసింది. అంతే గాకుండా న్యూడ్‌గా ఉన్న పలువురు యువతులపై డబ్బుల కట్టలు పడేసినట్లుగా వీడియోలు చూపెడుతూ వలలో వేసుకున్నట్లు సమాచారం? ఇక్కడ ఇబ్బంది అయితే పాతబస్తీలో మరో రెండు చోట్ల అడ్డాలు ఉన్నట్లు అక్కడ కూడా నగ్న చిత్రాలు, వీడియోలు తీసుకోవచ్చు అని సదరు యువతులతో అన్నట్లు తెలిసింది.

అతని వలలో చిక్కుకున్న ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి జరిగినదంతా చెప్పి డబ్బులు కావాలంటే వెళ్లొచ్చు అని చెప్పిందని, సదరు యువతి ఓ సామాజిక మహిళా కార్యకర్తకు గోడును వెళ్లబోసుకుంది. గత డిసెంబర్ 4వ తేదీన సదరు యువతితో కలిసి సామాజిక కార్యకర్త చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి డెకాయ్​ఆపరేషన్​నిర్వహించింది.

ఆ ఆపరేషన్‌లో ముందుగా లోనికి వెళ్లిన ఇద్దరు సామాజిక కార్యకర్తతో పాటు మరో యువతి నిరుపేదలమని నమ్మించి, తమకు డబ్బులు అవసరం చాలా ఉందని తన స్నేహితురాలు చెబితే ఇక్కడికి వచ్చామని బాబాకు చెప్పింది.

అతని సెల్​ఫోన్‌లో ఉన్న ఇతర మహిళల నగ్న వీడియోలు చూపెట్టినట్లు సమాచారం. సదరు యువతులను లోనికి తీసుకువెళ్లి గడియ వేస్తుండగా చాంద్రాయణగుట్ట పోలీసులకు సదరు యువతులు కాల్ చేయడంతో బాబా అసలు రంగు బట్టబయలయ్యింది.

అప్పట్లో సయ్యద్ హుస్సేన్​ పై 417, 420, 453 క్లాస్ (బి) సెక్షన్ కింద చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉండడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తిరిగి సయ్యద్ హుస్సేన్‌ను పోలీస్​కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

బాబా మరదలు అరెస్ట్​అయ్యిందా ? లేదా? అతని డైరీలో ఎంత మంది పేద యువతుల పేర్లు నమోదై ఉన్నాయి? ఇంతకు కర్ణాటకలో ఉన్న బాబా ఉస్తాద్ అరెస్టయ్యాడా? లేదా ? బాబా తెర వెనుక ఉన్నది ఎవరు ? ఇదంతా అంతరాష్ట్ర ముఠాపనేనా ? కాంట్రాక్ట్ మ్యారేజ్‌ల మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నారా? అనే అంశాలు ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది.

5,488 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?