మహిళా ఎస్సైపై వేధింపులు!
సంతోష్‌నగర్ సీఐపై శాఖాపరమైన చర్యలు
మాదన్నపేట : మహిళా ఎస్సైను వేధిస్తున్న సీఐపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టి.వంశీకృష్ణారావు.. అనుచితంగా ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వంశీకృష్ణారావును నగర కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీఅయ్యాయి. ఠాణా ఇన్‌ఛార్జి సీఐగా భవానీనగర్ డీఐ శేఖర్‌రెడ్డిని నియమించారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ వంశీకృష్ణారావును ఎటాచ్ చేసినట్లు మాత్రమే తమకు సమాచారం ఉన్నట్లు సంతోష్‌నగర్ ఏసీపీ మహమ్మద్ గౌస్ తెలిపారు.
మహిళా ఎస్సై కుటుంబంలోని తగాదాలను అవకాశంగా చేసుకొని ఆమెతో సీఐ అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో సీఐపై అంతర్గత విచారణ చేపట్టారు.
వరుస ఘటనలు..
గతేడాది సైతం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అధికారుల లైంగిక వేధింపులపై 10 వరకూ ఫిర్యాదులు అందాయి.
అంతర్గత విచారణలో వాస్తవమని తేలడంతో మారేడుపల్లి, లాలాగూడ పోలీస్‌స్టేషన్లలో పనిచేసిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మహిళా ఎస్సైను వేధించిన మరో ఎస్సైను సర్వీసు నుంచి తొలగించారు.
ఇవే ఆరోపణలతో మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం.