
ఆమె పేరు ప్రభ కుమారి. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ యువతి బాగా కష్టపడి చదివింది. చివరికి తనకున్న టాలెంట్ తో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించింది.
అలా తన జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఆమె ప్రియుడు తుపాకీతో కాల్చి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రియుడు ప్రియురాలిని ఎందుకు కాల్చి చంపాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది బీహార్ కతిహార్ కోదా పరిధిలోని భట్వారా గ్రామం. ఇక్కడే ప్రభ కుమారి అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. చదువును పూర్తి చేసిన ఆ యువతి గతంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించింది.
ఇదిలా ఉంటే ఈ యువతికి స్థానికంగా ఉండే చోటు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభ కుమారి గత కొన్ని రోజుల నుంచి ప్రియుడికి దూరంగా ఉందని కూడా తెలుస్తుంది. దీంతో ప్రియుడు తట్టుకోలేక అనేక సార్లు ప్రభ కుమారితో గొడవ పడ్డాడు.
ఈ క్రమంలోనే చోటు.. నీకు పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేసేవాడు. ఇదే అంశం ఇద్దరి మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన చోటు.. ప్రియురాలిని చంపాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే చోటు ఇటీవల ప్రియురాలిని ఫోలో అయ్యాడు. ఇక ఓ చోట ప్రభ కుమారిని కలుసుకున్నాడు.. మాట్లాడుతున్నట్లు నటించిన చోటు.. తన వెంటతెచ్చుకున్న గన్ తో ప్రియురాలు ప్రభ కుమారిని కాల్చి చంపాడు.
వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురి నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.