హైదరాబాద్ వనస్థలీపురంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం
Fire broke out : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. నగరంలోని బాగ్ లింగంపల్లి వీఎస్ టీ, వనస్థలీపురంలో అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
వనస్థలీపురంలోని ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల రీ బాటనింగ్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బాగ్ లింగంపల్లి వీఎస్టీ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫంక్లన్లకు మెటీరియల్ సప్లై చేసేగోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న బస్తీ వాసులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఫైరింజన్లతో అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.