
లాఠీ సినిమా స్టైల్లో మద్యం సీసాలు పగలగొట్టి నోట్లో పొడిచారు .. అతడ్ని ఎందుకు హతమార్చారంటే ..?
కామరెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
అత్యంత దారుణంగా లాఠీ సినిమా స్టైల్లో ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్‌ని కిరాతకంగా హతమార్చిన వార్త స్థానికంగా కలకలం రేపింది.
నస్రుల్లాబాద్ మండలం అంకుల్ గ్రామానికి చెందిన నీరడి శ్రీనివాస్ మర్డర్ కేసులో స్థానికుల్ని షాక్‌కు గురి చేసింది.
శ్రీనివాస్‌కు సావిత్రితో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే శ్రీనివాస్ బాన్సువాడ ఆర్టీసీ డిపో ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
అయితే శ్రీనివాస్ ఇంటి ఎదురుగా కల్లు డిపోలో పని చేసే కిషన్ గౌడ్ శ్రీనివాస్ భార్య సావిత్రి వివేహత సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం తెలిసిన శ్రీనివాస్ మూడు నెలల క్రితం కిషన్ గౌడ్‌తో గొడవపడ్డాడు. ఇదే గొడవ కారణంగా భార్య సావిత్రి, భర్త శ్రీనివాస్‌తో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాస్, కిషన్ గౌడ్ లు తీవ్రంగా గొడవ పడ్డారు.
అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాస్‌ను తీసుకెళ్లి ఫుల్‌గా మద్యం తాగించారు. మత్తులో ఉండగానే నోట్లో మద్యం సీసాతో పొడిచి దారుణంగా హతమార్చారు.
మరుసటి రోజు ఉదయం బాన్సువాడలో కండక్టర్ రవి అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు పక్కన శ్రీనివాస్ మృతదేహం కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థాలానిక చేరుకుని డాగ్ స్కాడ్ తో పరిసరాల్లో ఆధారాల కోసం గాలించారు.
క్లూస్ టీమ్‌తో సాక్ష్యాలు సేకరించారు. మృతుని సోదరుడి ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బస్ డ్రైవర్ నీరడి శ్రీనివాస్ హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న కిషన్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యోదంతంలో అతనికి సహకరించిన బాలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో విచారిస్తున్నారు.
వివాహేతర సంబంధం ఓ పచ్చని కాపురంలో నిప్పులు పోసిందనే వార్త ఆ నోట..ఈనోట పడటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
ముగ్గురు తండ్రి హత్యకు గురికావడంతో అతని ముగ్గురు పిల్లలు తండ్రి లేని వాళ్లయ్యారని విచారం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా ఈ తరహా సంఘటనలు, నేరాలు ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇంత దారుణంగా సీసాలు పగలగొట్టి గొంతులో పొడిచి చంపడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.