జర్నలిస్టుల రుణం తీర్చుకుంటా..

Spread the love

జర్నలిస్టుల రుణం తీర్చుకుంట

▪️కొత్త ఏడాదిలో మీ కోరిక తీరుతుందని హామి.

▪️ఖమ్మంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి రోల్ మోడల్ గా నిలుస్తా.

▪️ఎమ్మెల్యేలతో కూర్చుని అన్ని నియోజకవర్గాల్లోను కేటాయింపునకు కృషి.

▪️టీఆర్ఎస్ కు టీజేఎఫ్ తో పేగు బంధం.

▪️ఖమ్మం ప్రెస్ క్లబ్ కు రూ.40 లక్షల నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులు.

▪️TUWJ 3వ మహాసభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.

జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపును నూతన సంవత్సరంలో పూర్తిచేసి విలేకరుల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉద్ఘాటించారు.

జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి జన్మ సార్థకం చేసుకుంటానని ప్రకటించారు.

ఆదివారం ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్లో టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన మూడో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

ఖమ్మం ఉమ్మడి జిల్లా నలు మూలల నుంచి తరలివచ్చిన వెయ్యి మంది జర్నలిస్టుల హర్షద్వానాల నడుమ మంత్రి అజయ్ కుమార్ గారు జర్నలిస్టుల సమస్యలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఖమ్మంలో ఇప్పటికే జర్నలిస్టుల కోసం 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం అవుతున్నాయని, మరో వంద ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు.

ఖమ్మంలో ఇళ్ల స్థలాలను కేటాయించి రోల్ మోడల్ గా నిలుస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా ఈ సమస్యను తన సమస్యగా భుజాన వేసుకుని పరిస్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జర్నలిస్టుల ఈ ప్రధాన సమస్య పరిష్కారంపై నేను ఎమ్మెల్యేలందరికీ దిక్సూచిగా నిలుస్తానని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ఇళ్ల స్థలాల కేటాయింపు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమక్షంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు.

టీజేఎఫ్ తో పేగు బంధం..

టియుడబ్ల్యూజే కు టిఆర్ఎస్ తో పేగు బంధం ఉన్నదని మంత్రి అజయ్ కుమార్ అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ సారధి కేసీఆర్ కు టియుడబ్ల్యూజే బాసటగా నిలిచిందని గుర్తు చేశారు.

ఆ సమయంలో కేసీఆర్ తో కలిసి పోరాడిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో అల్లం నారాయణ ఒకరని పేర్కొన్నారు.

181 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?