తెలంగాణలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి తెలంగాణలో ఘోర ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ బండరాయి పడి 8 మంది కూలీలు మృతిచెందారు. లారీ లోడ్ నుంచి ఆటోపై బండరాయి పడి ప్రమాదం జరిగింది. కురవి మండలంలోని అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతులను చిన్నగూడూరు మండలంలోని జయ్యారం వాసులుగా గుర్తించారు. వారు కూలీ పనుల కోసం వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి […]
Read Moreభైరి నరేష్ అరెస్టు! అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్టు హనుమకొండ : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఈ నెల 19న బైరి నరేశ్ అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదస్పదంగా మారింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా […]
Read Moreఇంటర్‌తో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాలుసెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) 1458 ఏఎస్సై(స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 4 నుంచి జనవరి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు : మొత్తం 1458 ఉద్యోగాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) పోస్టులు 143, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) ఉద్యోగాలు1315 ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. 18 […]
Read Moreకొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. పిచ్చా లేక మొండి తనమా.. షాకింగ్ వీడియో.social media viral: ఎన్నో రకాల వీడియోలకు సోషల్ మీడియా అడ్డాగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆనందాన్ని పంచితే మరికొన్ని విజ్ఙానాన్ని అందిస్తాయి. అయితే మరికొన్ని మాత్రం ఒళ్లు జలదరించేలా చేస్తాయి. ఆ వీడియోలు చూస్తే గుండె జారినంత పని అవ్వకమానదు. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు చేసిన పనికి కొందరు ఏం ధైర్యంరా […]
Read Moreతిరిగి కాంగ్రెస్ గూటికి గులాంనబీ ఆజాద్..! ఆయనే క్లారిటీ ఇచ్చారు..కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే […]
Read Moreరియల్ ఎస్టేట్ బ్రోకర్ కేసీఆర్.. ఎవడబ్బ సొమ్మని పంచుతున్నారు? ఈటల ఫైర్..రంగారెడ్డి జిల్లా: ‘నాటి ప్రభుత్వాలు పేదల కు ఉచితంగా భూములను పంచితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ఆయా రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకుంటోంది. ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారారు. బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.ఐదు కోట్లకు పైగా పలుకుతుంటే..ప్రభుత్వం మాత్రం రైతుల సమ్మతి, సంబంధం […]
Read Moreపంచాయతీ బిల్లులు రాక ఉపసర్పంచ్ ఆత్మహత్యగ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాకపోవడంతో ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సర్పంచి అంతర్గాం రాజమౌళి కథనం ప్రకారం.. చిదినేపల్లి గ్రామ ఉపసర్పంచ్ బాలినేని తిరుపతి పంచాయతీ బిల్లులు మంజూరు కాకపోవడంతో మనస్తాపంతో శనివారం పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం వరంగల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గ్రామంలో పలు అభివృద్ధి పనుల […]
Read Moreప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. సైనస్ చికిత్సతో బాలిక మృతి ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకం ఓ బాలిక ప్రాణాలు తీసింది. వైద్యం పేరుతో ఐదేళ్ల బాలిక మృతికి కారణం అయింది. రాజేంద్రనగర్ కాటేదాన్ లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 29న అనారోగ్యంతో బాధపడుతున్న సాన్విక అనే ఐదేళ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక సైనస్ తో బాధపడుతుందని వెంటనే ఆస్పత్రి చేయాలని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. తమ కూతురును […]
Read MoreTSPSC Group-4: నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ షాక్.. భారీగా తగ్గిన గ్రూప్-4 ఖాళీలు.. అర్ధరాత్రి నుంచి మొదలైన అప్లికేషన్లుతెలంగాణ పబ్లిక్ సర్వీస్ గ్రూప్-4 విషయంలో అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. తుది నోటిఫికేషన్లో భారీగా ఖాళీలను తగ్గించింది. దరఖాస్తుల విషయంలోనూ నిరుద్యోగును నిన్న ఉదయం నుంచి గందరగోళానికి గురి చేసింది తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల (Telangana Police Jobs) తర్వాత అత్యంత ఎక్కువ మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూసింది గ్రూప్-4 నోటిఫికేషన్ (TSPSC Group-4 Notification) కోసమే. 9 […]
Read Moreఅయ్యప్పస్వామిపై భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ భైరి నరేష్‌పై అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి శుక్రవారం కోస్గి మండల కేంద్రంలో భైరి నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు, రాస్తారోకో చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాలరాజు అనే వ్యక్తిని పరిగెత్తిస్తూ మాలధారులు చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొనగా.. పోలీసులు కలుగుజేసుకుని అతన్ని అక్కడి […]
Read More