
మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
— పక్కఫ్లాట్ కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టిన ఇరిగేషన్ ఈఈ
— విలేకరుల సమావేశంలో బాధితుడు సుబ్రహ్మణ్యం

ఖమ్మం, నవంబర్ 14 : ఖమ్మం నగరం బుర్హానపురంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి పక్కనున్న ప్లాట్ ను కబ్జా చేసి మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించడని, అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా బిల్డింగ్ నిర్మాణం చేపడితే ఖమ్మం మున్సిపల్ నగర అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని సాయి ప్రభాత్ నగర్ కు చెందిన బాధితుడు డాక్టర్ సివియన్ సుబ్రహ్మణ్యం ఆరోపించారు. సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… బుర్హానపురంలోని తన ఇంటి స్థలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తలుపుల శ్రీను తన భార్య పేరు మీద ఇంటి నిర్మాణం చేపడుతూ తనకు చెందిన ఇంటి స్థలంలోకి చొచ్చుకొని వచ్చి బేస్ మట్టం పగులగొట్టి సరిహద్దు దాటి అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నారని తలుపుల శ్రీనుకి తెలియజేస్తే నీ దిక్కున్నకాడ చెప్పుకో పో అని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. ఈ విషయమై మున్సిపల్ అధికారులైన టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ లకు మా ప్లాటు డాక్యుమెంట్లు, అక్రమ నిర్మాణ ఫోటోలతో సహా ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జీవో నెంబర్ 168కి విరుద్దంగా అక్రమార్గంలో సెట్ బ్యాగ్ లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశానని, సమాచార హక్కుచట్టం ద్వారా సమాచారం అడిగితే ఇవ్వలేదన్నాడు. ఇట్టి విషయమై సమాచార హక్కు చట్టం కమిషనర్ కు ఫిర్యాదు చేయడం తో స్పందించి.. నగరపాలక కమిషనర్ కు నోటీసులు జారీ చేశారని తెలిపారు.
అక్రమ నిర్మాణంపై విచారణ జరిపి జీవో 168 ప్రకారం చర్యలు చేపట్టవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కు, జిల్లా కలెక్టర్ కు లికిత పూర్వక ఆదేశాలు అందాయని తెలిపాడు. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణం చేపట్టిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోని ఖమ్మం నగర మున్సిపల్ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
For justice call on 8008295588