
ఇద్దరు సీఐల ప్రేమాయణం, లేడీ సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
వారంతా చట్టానికి ప్రతినిధులు. తప్పు చేసే ప్రబుద్ధులకు బుద్ధి చెప్పే గౌరవమైన వృత్తిలో ఉన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారే..
ఇప్పుడు నిందితులుగా నిలబడ్డ ఘటన ఇది. హన్మకొండ జిల్లాలో జరిగింది. ఓ మహిళా సీఐ తన కొలీగ్ అయిన మరో సీఐతో రిలేషన్ పెట్టుకుంది. ఇక.. ఆమె భర్త కూడా సీఐగా ఉండడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాగా, ఈ ఘటనలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళా సీఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
హన్మకొండ రాంనగర్ లోని మహిళా సీబీసీఐడీ సీఐ ఇంట్లో, మరో సీబీసీఐడీ సీఐతో కలిసి ఉన్నట్టు మహిళ ఇన్స్ పెక్టర్ భర్త మహబూబాబాద్‌లో పనిచేస్తున్న సీఐకి పక్కా సమాచారం అందింది. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిన అతనికి అక్కడి దృశ్యం చూసి షాకయ్యారు. తన భార్య పనిచేసే సిబిసీఐడీ డిపార్ట్మెంట్ కు చెందిన వింగ్ లోనే పనిచేస్తున్న సహచర సీఐతో అక్రమసంబంధం కొనసాగిస్తున్నట్టు తెలుసకున్నాడు. ఈ క్రమంలో భర్తే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇప్పుడీ విషయం హన్మకొండ, వరంగల్ జిల్లాలతోపాటు యావత్ తెలంగాణలోనే హాట్ టాపిక్ అయ్యింది. ముగ్గురు ఇన్స్ పెక్టర్ల బండారం బయటకు పొక్కడంతో యావత్తు పోలీస్ శాఖకే మాయని మచ్చగా మిగిలిందీ వ్యవహారం. మహిళ సీఐ మంగ భర్త రవికుమార్ ఫిర్యాదు మేరకు ఐపిసీ 448, 506 సెక్షన్ల కింద సుబేధారి పోలీసులు కేసు నమోదు చేశారు.
Idi news ante…
Lucha పోలీసులు…
Inka chaala unnaru…
Money iste no case…leedante akrama case book chesi నిరపరాధి ani prove chesko antunnaru…
Policing failed to protect the people…