Month: September 2022

మెట్రో రైల్ కు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలి: రేవంత్ రెడ్డి

September 30, 2022

మెట్రో రైల్ కు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలి: రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు మణిహారమైన మెట్రో రైల్ కు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పెరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ కు మెట్రో రైలు మాంజూరు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి […]

Read More

మందు బాబులకు షాక్… పెరగనున్న మద్యం ధరలు

September 30, 2022

దసరా పండుగవేళ లిక్కర్​ రేట్ల పెంపు.. 10 నుంచి 15శాతం పెంచాలన్న ప్రతిపాదనలు హైదరాబాద్‌ : మద్యం ధరల పెంపు కోసం డిస్టిలరీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందుకు అనువుగా దసరా పండుగ సందర్భంగా లిక్కర్‌ కొరతను సృష్టిస్తూ కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే విమర్శలు వినిెపిస్తున్నాయి. ఒకవైపు దసరా పండుగ మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలు మద్యం ధరల పెంపునకు డిస్టలరీలు అనువైన సమయంగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో రాబడిని పెంచుకోవాలని భావించిన ఆబ్కారీ శాఖ అమ్మకాలు […]

Read More

17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక మలుపు

September 30, 2022

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. తీవ్ర నేరం చేసిన దృష్ట్యా ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేపట్టాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నేరాభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన […]

Read More

అంగన్వాడీలకు షాక్ …రదైన ఆ నోటిఫికేషన్‌!

September 30, 2022

అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు: అనురాధ అమరావతి: అంగన్వాడీ సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌-2) (పదోన్నతి పరీక్ష) నియామకం నోటిఫికేషన్‌ రద్దు చేశామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. నోటిఫికేషన్‌ రద్దు చేసేందుకు సీఎం జగన్‌ కూడా అంగీకరించారని చెప్పారు. న్యాయనిపుణుల సలహా మేరకు నోటిఫికేషన్‌ రద్దు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఫలితాలను నిలుపుదల చేశామని వెల్లడించారు. 55,607 అంగన్వాడీలు ఉండగా.. ప్రతి 25 అంగన్వాడీలకు ఒక […]

Read More

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపులు

September 30, 2022

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు పార్టీ సీనియర్‌ నేతలు శశిథరూర్‌, దిగ్విజయ్‌ సింగ్‌ మధ్యే ప్రధాన పోటీ జరుగుతుందని అందరూ భావించారు. కానీ, ఇవాళ ఉదయం అనూహ్యంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు మద్దతు తెలుపుతూ అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దృష్టంతా ఖర్గేపై పడింది. అసలు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్టుండి ఖర్గే పేరును […]

Read More

తెలంగాణలోకి ఎంట్రీ కానున్న భారత్ జూడో యాత్ర

September 30, 2022

తెలంగాణలోకి ఎంట్రీ కానున్న భారత్ జూడో యాత్ర తెలంగాణ లో రాహుల్ గాంధీపాదయాత్ర రూట్ మ్యాప్ తెలంగాణలో మొత్తం 13రోజులకే కుదించిన రాహుల్ తెలంగాణలో 359కిలోమీటర్లు నడవనున్నరు. 13 రోజుల పాటు రోజువారీగా నియోజకవర్గాలజాబితా సిద్ధం. మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానున్న భారత్ జోడో యాత్ర.1వ రోజు.. మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో భారత్ జోడో యాత్ర..రాహుల్ పాదయాత్ర లో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ […]

Read More

ట్రాఫిక్‌ కొత్త నిబంధనలు… గీత దాటితే అంతే!

September 30, 2022

గీత దాటితే రూ.100 కట్టాల్సిందే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కొత్త నిబంధనలు హైదరాబాద్‌: భాగ్యనగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు దఫాలుగా ట్రాఫిక్‌ విభాగం అధికారులతో సమావేశమైన సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ‘రోప్‌’ (రిమూవల్‌ ఆప్‌ అబ్‌స్ట్రిక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే రూ.100, […]

Read More

ఆర్ యం పి డాక్టర్ కు దేహశుద్ధి చేసిన తెలుగు తమ్ముళ్లు

September 30, 2022

ఆర్ యం పి డాక్టర్ కు దేహశుద్ధి చేసిన తెలుగు తమ్ముళ్లుసామాజిక మాధ్యమంలో నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తికి ఖమ్మం తెదేపా నాయకులు గురువారం దేహశుద్ధి చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. తన ఫేస్ బుక్ లో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. […]

Read More

నిందుతులను అదుపులోకి తీసుకున్న ఖమ్మం పోలీసులు

September 30, 2022

28 చోరీ కేసుల్లో 8 మంది నిందుతులను అదుపులోకి తీసుకున్న ఖమ్మం పోలీసులు -40 లక్షల విలువ చేసే బంగారం వెండి చోరిసొత్తు రికవరీ -వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ కొంతమంది వ్యక్తులు ముస్తఫానగర్ నివాస ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న ఉదయం ఖమ్మం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.పోలీస్ కాన్ఫరెన్స్ […]

Read More

ఇదేందయా ఇది.. నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్!

September 30, 2022

ఇదేందయా ఇది.. నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్! మునుగోడు నేతలకు దండం పెట్టాల్సిందే.. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విజయదశమికి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్శిస్తూనే.. గతంలో తమ పార్టీ నుంచి బయటికి వెళ్లిన నేతలను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో నేతల జంపింగ్ లు జోరందుకున్నాయి. […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?